డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

- Advertisement -

హైదరాబాద్, సెప్టెంబర్ 19:  తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 20 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. డీఎస్సీ పరీక్షను నవంబర్‌ 20 నుంచి 30 వరకు కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించునున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్సిపల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఖాళీల్లో ఎస్‌జీటీ – 2,575 పోస్టులు; స్కూల్‌ అసిస్టెంట్‌ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ – 611 పోస్టులు, పీఈటీ – 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 358, నిజామాబాద్​ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు…

➥ ఆదిలాబాద్: 275

➥ ఆసిఫాబాద్: 289

➥ భద్రాద్రి కొత్తగూడెం: 185

➥ హనుమకొండ: 54

➥ హైదరాబాద్: 358

➥ జగిత్యాల: 148

➥ జనగాం: 76

➥ జయశంకర్ భూపాలపల్లి: 74

➥ జోగులాంబ: 146

➥ కామారెడ్డి: 200

➥ కరీంనగర్: 99

➥ ఖమ్మం: 195

➥ మహబూబాబాద్: 125

➥ మహబూబ్ నగర్: 96

➥ మంచిర్యాల: 113

➥ మెదక్: 147

➥ మేడ్చల్: 78

➥ ములుగు: 65

➥ నాగర్ కర్నూల్: 114

➥ నల్గొండ: 219

➥ నారాయణపేట: 154

➥ నిర్మల్: 115

➥ నిజామాబాద్: 309

➥ పెద్దపల్లి: 43

➥ రాజన్న సిరిసిల్ల: 103

➥ రంగారెడ్డి: 196

➥ సంగారెడ్డి: 283

➥ సిద్దిపేట: 141

➥ సూర్యాపేట: 185

➥ వికారాబాద్: 191

➥ వనపర్తి: 76

➥ వరంగల్: 138

➥ యాదాద్రి: 99

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular