భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు

- Advertisement -

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల నేపద్యంలో భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా అదికారులు చర్యలు చేపడుతున్నారు.టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, టీటీడీ ఈవో శ్రీఎవి.ధర్మారెడ్డి గ్యాలరీలను పరిశీలించి భ‌క్తులకు అందజేస్తున్న అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌రుగుదొడ్లు ఇతర సౌకర్యాలపై భక్తులతో ముచ్చటించారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్యాలరీల్లో లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular