నిమజ్జనం అడ్డంకులకు ప్రభుత్వమే బాధ్కత వహించాలి: రాజాసింగ్
హైదరాబాద్: హిందువులకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం. 2014లో తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువులపై దౌర్జన్యం చేసిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. దాదాపు 30ఏళ్ల నుంచి ట్యాంక్ బండ్ లో మురుగునీరు, కంపెనీలకు చెందిన రసాయనాలు కలుస్తున్నాయి. మురుగు నీరు, కంపెనీలకు సంబంధించిన రసాయనాలు కలిస్తే పొల్యూషన్ కాలేదా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనం జరుగుతుంది. ట్యాంక్ బండ్ నీళ్లు కాలుష్యం అవుతున్నాయని కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరుపున న్యాయవాది సరైన వాదనలు చేయలేదు. పీఓపీ గణేష్ లను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కాలుష్య నియంత్రణ మండలి ఏమీ చేస్తుంది. ట్యాంక్ బండ్ నీళ్లు కలుషితమైనవని తెలియదా. ప్రతి సంవత్సరం మాదిరిగానే గణేష్ నిమజ్జనం జరుగుతుంది. ఏదైనా అడ్డంకులు సృష్టిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అయన అన్నారు.