చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

- Advertisement -

గంభీరావుపేట మండల నాయకులు

గంభీరావుపేట సెప్టెంబర్ (వాయిస్ టుడే ప్రతినిధి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి చిట్యాల ఐలమ్మ  పెత్తందారుల కబంధ హస్తాల నుండి భూమిలేని పేదలకు భూమి పంపిణీ  చేయాలని అనేక పోరాటాలు చేసిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల అధ్యక్షుడు గంట అశోక్ అన్నారు.భూమి లేని నిరుపేదలను ఏకం చేసి వారందరికి సాయుధ పోరాట యోధురాలుగా నిలిచి ముందుండి కొట్లాడిన వీరనారి చాకలి ఐలమ్మ  యొక్క పోరాట ప్రతిమ తెలంగాణలో చిరస్థాయిగా నిలిచిపోతుందని గంట అశోక్ అన్నారు. ప్రతి ఒక్కరు కూడా దొరలకబంధహస్తాల్లో ఉండిపోయినటువంటి భూమిని లేని నిరుపేదలకు వచ్చే విధంగా కృషి చేయాలని అశోక్ అన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని గంభీరావుపేట సర్పంచ్ కటకం శ్రీధర్  అన్నారు.గంభీరావుపేట మండల రజక సంఘం ఆధ్వర్యంలో  ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు.కార్యక్రమంలో..గంభీరావుపేట మండల రజక సంఘం అధ్యక్షులు గుండారం మహేందర్, మండల ప్రధాన కార్యదర్శి గుడెపు రవి , గుండారం మధుసూదన్, గ్రామ  రజక సంఘం అధ్యక్షులు ధీటి బిక్షపతి, ఉపాధ్యక్షులు కే.పోచయ్య, గూడెపు రాజు,రాములు దేవయ్య నరసయ్య మరియు రజక సంఘ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular