మోడీ పాలనలో మహిళలకు భద్రత కరువు…
మహిళల హక్కులు,చట్టాల రక్షణకై ఐద్వా ఆధ్వర్యంలో అక్టోబర్ 5న చలో ఢిల్లీ..
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ…
సూర్యాపేట, సెప్టెంబర్ 29(వాయిస్ టుడే జిల్లా ప్రతినిధి వైవి): మోడీ 9 ఏళ్ల పాలనలో దేశంలో మహిళలకు భద్రత కరువైందని మహిళల హక్కులు చట్టాల రక్షణ ఉపాధి కొరకు అక్టోబర్ 5వ తేదీన ఐద్వా ఆధ్వర్యంలో జరుగు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. అక్టోబర్ 5న జరుగు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాత ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సుందరయ్య నగర్ లో జరిగిన సభలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ మోడీ హాయంలో దేశవ్యాప్తంగా మహిళలపై హత్యలు అత్యాచారాలు దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. దేశంలో ఏదో ఒకచోట ప్రతిరోజు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న మహిళా చట్టాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసమే జిమ్మిక్కులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు తెచ్చిందన్నారు. నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లును ఈ 2024 ఎన్నికల నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. అనేకమంది పేదలు ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదున్నారు. అంగన్వాడి ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు తమ హక్కుల కోసం సమ్మెలు నిర్వహిస్తుంటే ప్రభుత్వం పట్టినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి ద్వారా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అరికట్టాలని అన్నారు. వంటగ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే అందజేయాలని డిమాండ్ చేశారు మహిళల హక్కులు, రక్షణ మహిళల భద్రతపై భరోసా కల్పించాలని కోరుతూ అక్టోబర్ 5వ తేదీన జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ జాతకు కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ జిల్లా ఉపాధ్యక్షురాలు ఏలూగురి జ్యోతి సుందరయ్య నగర్ మహిళా నాయకులు ఒంటెపాక పార్వతమ్మ,చింత సునీత, కాంపాటి సైదమ్మ, ముక్కెర వెంకటమ్మ, వాలి, అనసూర్య, సరస్వతి, విజయ, ప్రమీల, రావేలా, సైదమ్మ, మంగమ్మ, లక్ష్మమ్మ, లింగమ్మ, పద్మ, ప్రజాసంఘాల నాయకులు బత్తుల వెంకన్న మొక్కెర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


