- Advertisement -
కోదాడ: ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు మాజీ ఎమ్మెల్యే చందర్ రావు లకు మధ్య వాగ్వాదం జరిగింది. కోదాడ పబ్లిక్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో ఒకరిపై మరొకరు మాటల యుద్ధం నడిచింది. పబ్లిక్ క్లబ్ ఎన్నికలు జరగాల్సిందే అని మాజీ ఎమ్మెల్యే చందర్ రావు పట్టుబట్టగా ఎమ్మెల్యే బొల్లం అభ్యంతర వ్యక్తం చేసారు. పబ్లిక్ క్లబ్ సమావేశానికి సభ్యుడి హోదాలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు హజరయ్యారు. వేదిక పై ఎమ్మెల్యే బొల్లం ఉన్నది చూసి వేదిక ఎక్కడానికి చందర్ రావు నిరాకరించడంతో వివాదం మొదలయింది. మీ హయాంలో ఇంటి దగ్గర కూర్చొని కార్యవర్గాన్ని రాసుకోలేదా అన్ని మాజీ ఎమ్మెల్యే చందర్ రావు ను ఎమ్మెల్యే బొల్లం విమర్శించారు.
- Advertisement -



