- Advertisement -
హైదరాబాద్, అక్టోబరు2: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుంది. అక్టోబరులో నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ఒకవైపు కసరత్తు చేస్తూనే, మరోవైపు ఈసీ అధికారులు తెలంగాణ పర్యటనకు సిద్ధమయ్యారు. రేపట్నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈసీ పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
- Advertisement -