Wednesday, January 15, 2025

బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటవు

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 2:  బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదని టీపీసీసీ రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వేవ్ ను ఆపడం ఎవరి తరం కాదని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అన్నారు. భయంతో ఉచిత సిలిండర్లు ,సన్న బియ్యం రేషన్ , రైతు లకు పెన్షన్ లాంటి హామీలు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడని అన్నారు. బీఆర్ఎస్ పనైపోయింది ,ప్రభుత్వం లో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరని అన్నారు. టిక్కెట్ ల ప్రకటన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాతే ఉంటుందని అన్నారు. టిక్కెట్ ల ప్రకటన నాటి కి చాలా మంది బీజేపీ, బీఆర్ఎస్ నేతల చేరిక ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలు మా పార్టీ లోకి వస్తున్నారంటేనే మా బలం ఏంటో అర్దం అవుతుందని అన్నారు.బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదని తెలిపారు. రాష్ట్రంలో 19% ఓట్లు అన్ డిసైడ్ లో ఉన్నాయి..ఇందులో మెజారిటీ ఓటు షేర్ మాకే వస్తుందని అన్నారు. మోడీ గుజరాత్ కు ప్రధాన ? ,లేక భారత దేశానికి ప్రధాన అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుందని అన్నారు. బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ జన్మ స్థలం మహబూబ్ నగర్ అన్నారు. మోడీ మహబూబ్ నగర్ వచ్చి కనీసం ప్రమోద్ మహాజన్ ను గుర్తు చేయలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇస్తారు అనుకున్నామని తెలిపారు. UPA హయాంలోనీ ITIR ను మోడీ ప్రకటిస్తారు అనుకున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలపై మాట్లాడతారు అనుకున్నాం….కనీసం ప్రస్తావించలేదన్నారు. గిరిజన యూనివర్సిటీ కొత్తగా ఇస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు. ససుపు బోర్డు అన్నారు…మాకు నమ్మకం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ ను అవమానించిన మోడీ తో మహబూబ్ నగర్ లో సభ పెట్టడం తప్పని కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ తెలంగాణను వ్యతిరేకించారు కాబట్టి రాజ్ గోపాల్, వివేక్, విజయశాంతి హాజరు కాలేదని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. మోడీ సభను ఏర్పాటు చేసిన బిజెపి నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ పర్యటనకు పరోక్షంగా కేసీఅర్ సర్కార్ సహకరించిందని అన్నారు. మిషన్ భగీరథ ,కాళేశ్వరం అవినీతి ,సింగరేణి దోపిడీ, లిక్కర్ స్కాంపై ఎందుకు మోడీ మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. అవినీతిపై చర్యలు తీసుకుంటామని మోడీ ఎందుకు అనలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. BRS ను గెలిపించేందుకు బిజెపి పన్నాగం అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మోడీతో సభలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు మోడీ తెలంగాణలో పర్యటన అన్నారు.బిల్లా రంగా లు చేరో దిక్కు తిరుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకడు ఈ దేశంలో ఉండే వాడు కాదు…అమెరికాలో చిప్పలు కడిగిండో లేదు తెలియదన్నారు. కాంగ్రెస్ విధానాల గురించి బిల్లా రంగా లు మాట్లాడతున్నారని అన్నారు. 2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఏపిలో కాంగ్రెస్ ఆరు హామీలను అమలు చేశామన్నారు. ఉమ్మడి ఎపిలో అమలు చేసిన పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినమా? బిల్లా రంగా లకు సవాల్ విసురుతున్న.. 2014 నుంచి కేసీఅర్ ఇచ్చిన హామీలు , BRS మ్యానిఫెస్ట్ ల పై మీరు చర్చకు సిద్ధమా ? అని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అమలు చేసిన హామీలపై చర్చకు మేము సిద్ధమన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉందని సన్నాసి లాజిక్ లు వద్దుని వ్యంగాస్త్రం వేశారు.కాంగ్రెస్ లో బహుళ నాయకత్వం ఉంటే మంచిదే కదా ? అన్నారు. రాజస్థాన్ , ఛత్తీస్ ఘడ్ లో అయిదేళ్ళు ఒకే సిఎం ఉన్నారు కదా ? అని గుర్తు చేశారు. ప్రజలు బండకేసి కొడితే కవిత , వినోద్ రావు లకు మూడు నెలలకే పదవులు ఇచ్చారని తెలిపారు. బిల్లా రంగా లు సిగ్గు తప్పిన మాటలు మాట్లాడవద్దని మండిపడ్డారు. సోనియా గాంధీ ప్రకటించిన అరు గ్యారెంటీ లను కాంగ్రెస్ అమలు చేస్తుంది తెలంగాణలో అని హామీ ఇచ్చారు. ఓట్ల కోసం NTR పేరును BRS వాడుకుంటుందని మండిప్డడారు. NTR పేరు నా పేరు ఒకటే అని కేటీఆర్ అంటున్నాడు. నక్కకు కుక్కకు ఉన్న తేడా పోల్చుకొకు కేటీఆర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. NTR ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రోజు ఆయన కుటుంబ సభ్యులు సచివాలయం రాలేదన్నారు. కానీ కేసీఆర్ కుటుంబసభ్యులు దోచుకుంటున్నారని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్