ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన క్రీడాకారులను సన్మానించిన మల్లారెడ్డి యూనివర్సిటీ బృందం….

19 Th Asian Games – Hangzhou 2022-23 లో బంగారు పతకం తో పాటు 3 రజత పదకాలు సాదించిన ఈషా సింగ్.. మల్లారెడ్డి యూనివర్సిటీ లో BBA మెదటి సం” చదువుతున్న ఈషా సింగ్… సత్కరించిన మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం..ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి..
ఈషా సింగ్ యువతకు ఆదర్శం అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన బి బి ఏ ప్రథమ సంవత్సర విద్యార్థిని ఇషా సింగ్ 19వ ఏషియన్ గేమ్స్ లో పాల్గొని, షూటింగులో ఒక బంగారు పతకం, మూడు వెండి పథకాలను సాధించి, నగరానికి తిరిగి వచ్చిన సందర్భంగా యూనివర్సిటీలో సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక మహిళ షూటింగ్లో పథకాలను సాధించడం దేశంలో ప్రధమం అన్నారు. యూనివర్సిటీ కి చెందిన విద్యార్థిని ఈ ఘనతను సాధించడం యూనివర్సిటీ తో పాటు దేశానికి గర్వకారణమని అన్నారు. ఆసక్తి ఉన్న రంగంపై దృష్టి సారించి, కష్టపడితే తప్పకుండా విజయం వరిస్తుంది అనడానికి ఈషా సింగ్ జీవితమే ఆదర్శం అన్నారు. అరుదైన రంగంలో ఆసక్తి చూపిన ఇషా సింగ్ ను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఈషా సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని, తమలో ఉన్న ప్రత్యేక సామర్థ్యాన్ని వెలికితీస్తే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు… మంత్రి మల్లారెడ్డి తమ వంతు ప్రోత్సాహకంగా 10 లక్షల రూపాయలు చెక్ రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ , మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్య కమిటీ సభ్యులు చామకూర మహేందర్ రెడ్డి, డాక్టర్ ప్రీతి రెడ్డి, వైస్ ఛాన్స్ లర్ వి ఎస్ కే రెడ్డి, వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.




