రామ్‌ చరణ్‌ కొత్త ఫ్రెండ్‌ ….?

- Advertisement -

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) కొత్త ఫ్రెండ్‌ని పరిచయం చేశారు. ఎవరైనా అమ్మాయినో, అబ్బాయినో ఆయన ఇంట్రడ్యూస్‌ చేశారనుకుంటే పొరపాటే!  ఎందుకంటే చరణ్‌ కొత్త ఫ్రెండ్‌.. బ్లేజ్‌ అనే గుర్రం. దానితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారాయన. కొన్ని క్షణాల్లోనే చరణ్‌ పోస్ట్‌ను లక్షలమంది నెటిజన్లు ‘లైక్‌’ చేశారు. ‘వావ్‌’, ‘సూపర్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సంబంధిత స్టిల్స్‌లో చరణ్‌ బ్లాక్‌ టీషర్ట్‌, కళ్లద్దాలు పెట్టుకుని కనిపించడంతో లుక్‌ అదుర్స్‌ అంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

Ram Charan's new friend...?
Ram Charan’s new friend…?

చరణ్‌కు గుర్రపు స్వారీ అంటే బాగా ఇష్టమనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన దగ్గర బాద్‌ షా, కాజల్‌ అనే రెండు గుర్రాలున్నాయి. తాను నటించిన ‘మగధీర’ సినిమాలో ఆ రెండూ కనిపిస్తాయి. బ్లేజ్‌ను కూడా చరణ్‌ తన కొత్త చిత్రంలో చూపించేందుకు ప్రయత్నం చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. శంకర్‌ దర్శకత్వంలో చరణ్‌ నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ సినిమాలోనే ఆ హార్స్‌తో చరణ్‌ రైడింగ్‌ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌ నటించనున్నారు. బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా మెరిసిన రవీనా టాండన్‌ కుమార్తె రాషా థడానీ ఈ సినిమాలో కథానాయికగా నటించనుందని రూమర్స్‌ వచ్చాయి..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular