
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. తిరుమలలోని అన్నమయ్య భవవ్‌లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. టిటిడి పారిశుధ్య కార్మికుల జీతాలను 12 వేల నుంచి 17 వేలకు పెంచాలని నిర్ణయించింది. 5 వేల మంది పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచనున్నారు. అలానే టిటిడి పరిధిలోని కార్పోరేషన్ లో విధులు నిర్వర్తిస్తూన్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 శాతం పెంచేలా.. కార్పోరేషన్లో పని చేసే ఉద్యోగులు ఆకాల మరణం పోందితే వారికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించేలా.. కార్పోరేషన్ లో పని చేస్తూ ఈఏస్ఐ వర్తించని ఉద్యోగులుకు హేల్త్ స్కీం అందించేలా నిర్ణయం తీసున్నామన్నారు.




