క్రితం ఎన్నికల్లో 2 కోట్లతో
షాదీఖాన కట్టిస్త అని 5 ఏళ్లుగా హామీని మరచిన ఆపద్ధర్మ MLA
ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎం. పి నిధులతో ముల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ పేరుతో శిలాపలకం ఏర్పాటు చేసి మళ్ళీ మోసం…
ఎం.పి నిధులు అంటే కేంద్ర ప్రభుత్యం నిధులు.. కేంద్రం లో బీజేపీ ప్రభుత్యం ఉంది. ఇప్పుడు షాదీఖాన ఎవరు నిర్మిస్తున్నట్టు?
ఇప్పుడు అక్కడ నిర్మాణం చేయబోయేది మైనారిటీ ఫంక్షన్ హాలా? లేక మల్టీ పర్పస్ ఫంక్షన్ హాలా?
మైనారిటీ ఫంక్షన్ హాల్ అయితే శిలాఫలకం మీద ముల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ అని ఎందుకు పెట్టారు?
మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

మాదాపూర్ డివిజన్ ఖనమేట్ విలేజ్ లో ఎం.పీ నిధులతో నిర్మిస్తున్న ముల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ అంటే అందరికి ఉపయోగపడే ఫంక్షన్ హాల్ కు శంకుస్థాపన చేస్తూ ముస్లిం మైనారిటీ లను పిలిచి ఇదే మీ ఫంక్షన్ హాల్ అని మభ్య పెడుతున్న వైనం..ఇప్పటికైనా మైనారిటీ సోదరులు తెలుసుకోవాలి.ఇచ్చిన హామీని గత 5 సంవత్సరాల నుండి నెరవేర్చకుండా మోసం చేసి తిరిగి ఎన్నికల సమయం లో మళ్ళీ మోసం చేస్తున్నారు.అక్కడ నిర్మించేది మైనారిటీ ఫంక్షన్ హాలా? లేక ముల్టీ పర్పస్ ఫంక్షన్ హాలా?అని MLA మైనారిటీ లకు సమాధానం చెప్పాలి. నిజాంగా మైనారిటీ ఫంక్షన్ హాల్ అయితే మైనారిటీ ఫంక్షన్ హాల్ అని కొత్త శిలాఫలకం పెట్టాలని మైనారిటీ ల తరపున డిమాండ్ చేస్తున్నాము.



