ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ఇంటికి కి తరలివస్తున్న అభిమానులు

- Advertisement -

ఎల్బీనగర్, వాయిస్ టుడే:

బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన నివాసానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం రావడం ఖాయమని కార్యకర్తలు పేర్కొన్నారు. తన నివాసానికి తరలివస్తున్న అభిమానులకు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ముద్దగౌని లక్ష్మీప్రసన్న దంపతులు కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular