Saturday, February 21, 2026

సోషల్ మీడియాలోఎన్నికల ప్రచారం మొదలెట్టిన కేసీఆర్ మనవడు

- Advertisement -

హైదరాబాద్:అక్టోబర్ 13:  రాష్ట్రంలో ఎన్నికలకు నెల రోజుల గడువే ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం మొదలెట్టారు. అవకాశం ఉన్న ప్రతీ చోట ప్రభుత్వ సంక్షేమ పథకాల విశిష్టతను వివరిస్తున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడంతో పాటు కేసీఆర్ వన్స్ ఎగైన్’ అంటూ గత నాలుగైదు రోజులుగా ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మనవడు,కల్వకుంట్ల హిమాన్షు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. సోషల్ మీడియా వేదికగా పార్టీకి తనవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

KCR's grandson who started the election campaign on social media
KCR’s grandson who started the election campaign on social media

ఈ క్రమంలోనే గతకొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను, కేసీఆర్ పరిపాలనను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. రెండ్రోజుల క్రితం ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు.

చిన్న సినిమాగా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కార్తికేయ-2 చిత్రంలోని ఒక డైలాగ్‌ను సీఎం కేసీఆర్‌ను వీడియోలకు లింక్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

ఈ పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మళ్లీ కేసీఆరే గెలుస్తారని అంటుండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం హైదరాబాద్ నగరాన్నే అభివృద్ధి చేశారు. గ్రామాలను గాలికొదిలేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఈసారి కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.  మరి హిమాన్షు సోషల్ మీడియా ప్రచారం బీఆర్ఎస్‌కు ఎంతమేర పనిచేస్తుందో చూడాలి..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్