బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలి

- Advertisement -

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, వాయిస్ టుడే:  ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ సాహెబ్ నగర్ గ్రామం నుండి గ్రామ వాస్తవ్యులు నీళ్ల రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి అధ్యక్షతన  బీఆర్ఎస్ పార్టీలో 50 మంది యువకులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు గడ్డం మల్లేష్ గౌడ్,  దండు సుధాకర్ యాదవ్, అశోక్ నాయుడు, లయన్ రాజు, సునీల్, రాఘవేందర్ రావు, జగన్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular