ఎల్బీనగర్, వాయిస్ టుడే: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని పథకాలకు ఆకర్షితులై యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ కు చెందిన నాయకులు శ్రీధర్ కుమార్, హరి ఆధ్వర్యంలో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలకు ఆకర్షితులై యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో శరత్, మధు, ఎల్లయ్య, జోయెల్ , తులసీరామ్, ఆనంద్, నవీన్, సతీష్, సాయికిరణ్, అక్షయ్, ప్రభాకర్, వెంకటేష్, శ్రీకాంత్, ప్రదీప్, హరికృష్ణ, శివ, అశోక్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో హస్తినాపురం డివిజన్ కాంగ్రెస్ నాయకులు జువ్వగాని రాజు గౌడ్, శ్రీశైలం కురుమ తదితరులు పాల్గొన్నారు.