- Advertisement -
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శ్రీమలయప్పస్వామివారు శంఖుచక్రాలతో యోగముద్రలో బద్రీనారాయణ అలంకారంలో ఐదు తలల చిన్న శేషవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి నాగలోకానికి రాజుగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా భారీగా భక్తులు తరలిరావడంతో తిరుమల గిరులు కోలాహలంగా మారాయి.
- Advertisement -