Friday, December 13, 2024

నా మీద పోటీ చేయండి

- Advertisement -

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్

హైదరాబాద్, అక్టోబరు 18, (వాయిస్ టుడే):  దమ్ముంటే నా మీద నువ్వు పోటీ చెయ్యి ఓవైసీ ? అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. గోషామహల్ లో అభ్యర్థులను నిలబెట్టాలని ఎంఐఎం నేతలకు రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ లోనే దారుసలెం, ఎంఐఎం ఆఫీస్ లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోషామహల్ లో అభ్యర్థులను ఎందుకు నిలబెట్టరు అని రేవంత్ రెడ్డి అడుగుతున్నడని తెలిపారు. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ఒవైసీలకు లేదని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ కాళ్ళు పట్టుకొని, ఇల్లీగల్ దందాలు చేసే చరిత్ర ఒవైసీ లది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Compete on me
Compete on me

అభ్యర్థులను నిలబెట్టి బ్లాక్ మెయిల్ దందాలు మొదలు పెట్టిండ్రని అన్నారు. ఒవైసీ కుటుంబమే అభివృద్ధి చెందుతోంది తప్ప ముస్లిం వర్గాలు కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఓట్లు అడగను, వాళ్ళు నాకు ఒట్లేయరు, వాళ్ళ ఓట్లు నాకు అవసరం లేదని అన్నారుగోషామహల్ లో ఓవైసీ అభ్యర్థులతో బిజినెస్ చేస్తాడని అన్నారు. ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు నిలబడాలో ఎంఐఎం పార్టీ ఆఫీస్ నుంచే డిసైడ్ అవుతదని తెలిపారు. 2014 ఎన్నికల్లో ముకేష్ గౌడ్ కు మద్దతు ఇచ్చేందుకు ఒవైసీ డబ్బులు తీసుకున్నాడని అన్నారు. 2018 ఎన్నికల్లో బీఅర్ఎస్ అభ్యర్థిని దారుసలేం నుంచే డిసైడ్ చేసిండని అన్నారు. 2023 ఈ ఎన్నికల్లో కూడా దారుసలెం నుంచే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. దారుసలేం కు ఇంకా డబ్బుల సంచులు వెళ్తే అభ్యర్థి ఎంపిక అయిపోతోందన్నారు. ఒక పెద్ద బిజినెస్ మాన్ అసదుద్దీన్ ఓవైసీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎంత డబ్బు సంపాదించుకుంటావ్ ఓవైసీ…? నా నియోజకవర్గంలో మీ అభ్యర్థిని పెట్టడానికి నీకు దమ్ము లేదా…? అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే నువ్వు పోటీ చెయ్యి ఓవైసీ నా మీద ? అంటూ సవాల్ విసిరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్