తెలంగాణ బిజెపి సీఎం అభ్యర్థిగా బండి సంజయ్?

- Advertisement -

యుహాత్మకంగా పావులు కదుపుతున్న బిజెపి అధిష్టానం

రాజ్యాధికారంలో పాలు పంచుకోనున్న  కూటమి

Bandi Sanjay as Telangana BJP CM candidate?
Bandi Sanjay as Telangana BJP CM candidate?

ఢిల్లీ అక్టోబర్ 19 ( వాయిస్ టుడే): సీఎం అభ్యర్థిగా బండి సంజయ్ ప్రకటిస్తే మరింత ఓటింగ్ శాతం బిజెపికి పెరుగుతుందని  బిజెపి అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి మొదటి చేదు అనుభవం కలిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటాలని పావులు కదుపుతోంది ఇందులో భాగంగానే గట్టి పోరాట పటిమ, మంచి మాస్ ఫాలోయింగ్  కలిగిన బండి సంజయ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే కిషన్ రెడ్డి అద్యక్షుడు గా  ప్రకటన తర్వాత అమాంతం  పడిపోయిన గ్రాఫ్ తిరిగి పెంచుకోగలరని మేధావుల అభిప్రాయం. దీనికి తోడు బుధవారం సేనానితో భేటీ అయిన కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ లు బిజెపి జనసేన పొత్తు పై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఇందులో సేనాని 30 సీట్లు దాకా అడిగిన విషయం  తేలిసిందే.బండి సంజయ్ గ్రాఫ్ కి జనసేన ఓట్లు తోడైతే మరింత ఓటింగ్ శాతం పెరిగి బాజాప, జనసేన ఉమ్మడి సీట్లు ఎక్కువగానే పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బిజెపి జనసేన కూటమి రాజ్యాధికారంలో తప్పకుండా పాలుపంచుకునే అవకాశం ఉందని మేధావుల ఆలోచన.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular