Monday, December 23, 2024

కామారెడ్డిలో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

- Advertisement -

నిజామాబాద్, అక్టోబరు 19, (వాయిస్ టుడే):  కాంగ్రెస్ అభ్యర్థుల మలివిడత జాబితా పై ఉత్కంఠ పెరుగుతోంది. తొలి లిస్ట్‌లో 55 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది పార్టీ. కానీ… అందులో అందరూ ఊహించిన కామారెడ్డి లేకపోవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పార్టీలో కీలకమైన నేత, మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ సాధించిన షబ్బీర్ అలీ పేరు ఫస్ట్‌ లిస్ట్‌లో లేకపోవడంపై ఆశ్చర్యపోయాయి పార్టీ వర్గాలు. మొదట్నుంటి కామారెడ్డి అంటే షబ్బీర్ అలీ.. షబ్బీర్‌ అంటే కామారెడ్డి అనిచెబుతోంది కాంగ్రెస్‌. కానీ… లిస్ట్‌లో పేరు లేకపోవడం ఏంటో అంతు చిక్కడం లేదట పార్టీ నేతలకు. దీన్ని బట్టి చూస్తే… సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి విషయంలో కాంగ్రెస్‌ పరంగా సంచలన నిర్ణయాలు ఉంటాయా అన్న సందేహాలు పెరుగుతున్నాయట. గజ్వేల్, కామారెడ్డి రెండు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్‌. గజ్వేల్ లో ఆయన మీద బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తానంటున్నారు. కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి కూడా బలమైన నాయకుడే.ఇక కామారెడ్డి విషయంలో కూడా కాంగ్రెస్ లోతుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కెసిఆర్ పై పోటీ చేసే అభ్యర్థి కోసం డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. జహీరాబాద్ లోక్‌సభ సీటు నుంచి గతంలో పోటీ చేసిన మదన్‌మోహన్‌రావును బరిలో నిలిపే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. కెసిఆర్.. మదన్‌మోహన్‌రావు ఇద్దరు ఒకే సామాజిక వర్గం అనే కోణంలో ఆలోచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతోపాటు మరో చర్చ కూడా నడుస్తోంది. వాళ్ళు వీళ్ళు కాకుండా… ఏకంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డే కామారెడ్డి బరిలో దిగే అవకాశం ఉందన్నది కాంగ్రెస్‌ ఇన్నర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.దీన్ని బట్టి చూస్తే… కేసీఆర్‌ని రెండు నియోజకవర్గాల్లో కట్టడి చేయాలన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా కనవిపిస్తోందంటున్నారు. రేవంత్ రెడ్డి గనుక కామారెడ్డిలో పోటీ చేస్తే గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా… పోటీ మాత్రం యమా రంజుగా ఉంటుంది. కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి మంచి ఇమేజ్ ఉంది. వరుసగా ఓడిపోయారన్న సానుభూతి కూడా ఆయనకు ప్లస్‌ కావచ్చంటున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నా..వేరే ఆలోచన లేకుండా… తన పని తాను చేసుకుంటూ పోతున్నారాయన. అందుకే… షబ్బీర్ బరిలో ఉంటే సానుభూతి వర్కౌట్ అవుతుందని…పార్టీ వేరే ఆలోచన చేసినా అది అంతగా కలిసి వస్తుందా ? లేదా అన్న మరో చర్చ కూడా నడుస్తోంది. అటు ఈ మొత్తం ఎపిసోడ్‌లో షబ్బీర్ అలీ కాస్త సంయమనాన్ని పాటిస్తున్నారట. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏముంది? కామారెడ్డి బరిలో నుంచి దిగేది ఎవరన్నది చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్