ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి పాటుపడతా: ఇంద్రసేనరెడ్డి

- Advertisement -

హైదరాబాద్: మలక్ పేట సలీమ్ నగర్ లోని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఇంటి వద్ద కోలాహలం మిన్నంటింది. అయన త్రిపుర గవర్నర్ గా నియమితులైన విషయం తెలిసిందే. దింతో అయన అభిమానులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఇంద్రసేనారెడ్డికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.
ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ త్రిపుర ప్రభుత్వం నుంచి ఉదయం ఫోన్ వచ్చిందన్నారు. బీజేపీలో ఉన్న వారికి గుర్తింపు వస్తుందన్నారు. గవర్నర్ గా నియమించడం పట్ల ఇంద్రసేనారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనకు వచ్చిన ఈ గుర్తింపు మలక్ పేట ప్రజలకు దక్కుతుందన్నారు. మలక్ పేట ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, నడ్డాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ ముగ్గురి మార్గదర్శనంలో పనిచేస్తానన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular