అమ్మవారి సేవలో జక్కిడి శివచరణ్ రెడ్డి

- Advertisement -

ఎల్బీనగర్, వాయిస్ టుడే: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ లోని శ్రీ భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారిని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ జక్కిడి శివచరణ్ రెడ్డి శనివారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, సాయిదీప్ గౌడ్, నవీన్ కుమార్, గౌతమ్, క్రాంతి సంతోష్, హేమంత్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular