Sunday, December 15, 2024

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

- Advertisement -

రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు అవసరమైన అనుమతులను నిబంధనల మేరకు సకాలంలో అందించాలి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాలోని చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు నిర్వహించే సమయంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ నగదు, బంగారం సీజ్ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, డీజీపీ అంజని కుమార్, ఇతర  రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఎంసీఎంసీ., నగదు, బంగారం పట్టివేత, సి విజల్ యాప్, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని, రాజకీయ పార్టీల, అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులకు తప్పనిసరిగా తీసుకున్న చర్యలపై లిఖిత పూర్వక సమాధానం అందించాలని సూచించారు.

ఎన్నికల ప్రచారం సంబంధించి సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి సువిధ యాప్ ద్వారా, ఆఫ్ లైన్ లో వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో  అనుమతులు మంజూరు చేయాలని, క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికల ప్రచారంలో వినియోగించే ఆడియో, వీడియోలను పరిశీలించి ఎంసీఎంసీ ధృవీకరించాలని, ప్రతి రోజూ ఎంసీఎంసీ, సువిధ యాప్, అఫ్ లైన్ దరఖాస్తులపై ఎన్నికల అధికారి దృష్టి సారించాలని సూచించారు.

ఎన్నికల సమయంలో నిర్వహించే తనిఖీల్లో నగదు, బంగారం సీజ్ చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై క్షేత్రస్థాయి అధికారులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు.  నగదు సీజ్ చేసే సమయంలో సంబంధిత వ్యక్తులకు సీజ్ చేస్తున్న నగదు, బంగారం వివరాలు, ఎక్కడ అప్పీల్ చేయాల్సి ఉంటుంది అనే అంశాలను తెలియజేస్తూ రశీదు తప్పనిసరిగా అందించాలని అన్నారు.

సీజ్ చేసిన బంగారం, నగదు 10 లక్షల కంటే తక్కువైతే  వెంటనే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కు అప్పగించాలని, 10 లక్షల కంటే ఎక్కువ నగదు సీజ్ చేస్తే ఐటీ అధికారులకు అప్పగించాలని అన్నారు. సదరు నగదుపై వచ్చే అపీల్ లను సంబంధిత గ్రీవెన్స్ సెల్, ఐటీ అధికారులు పరిశీలించి నిబంధనలు, ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారని అన్నారు.

ఎన్నికల విధులు నిర్వహించే ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలతో పాటు తప్పనిసరిగా వీడియో కెమెరా సౌకర్యం ఉండాలని, ప్రతి తనిఖీ వీడియో కెమెరాలో రికార్డు చేయాలని అన్నారు.

జిల్లాలో ఓటర్ స్లిప్పులు త్వరగా ముద్రించి పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని, సామాజిక మాధ్యమాలలో ఎన్నికల నిర్వహణపై వస్తున్న వదంతులు, అపోహలను నివృత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి సారించి పోలింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ గౌతం రెడ్డి, నోడల్ అధికారులు జితేంద్ర ప్రసాద్, ఎండీ.రఫీ, ఎం.దశరథం, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్