ధర్మస్థలిలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం
జగిత్యాల జిల్లా బ్యూరో (అక్టోబర్ 23,23)వాయిస్ టుడే :జగిత్యాల పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా స్థానిక గడియారం దగ్గర గల ధర్మస్థలిలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ ధ్వజారోహణ చేశారు.ఈ సందర్భంగా వి యచ్ పి గౌరవ అధ్యక్షులు వెంకట రాజిరెడ్డి మాట్లాడుతూ విజయదశమి మనము ఏ విధంగా హిందువులు పండుగ చేసుకుంటారు జమ్మి చెట్టు యొక్క పాలపిట్ట యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేశారు.తర్వాత మన ధర్మస్థలి నాటినుండి ఈరోజు వరకు ఇక్కడ ద్వాచారోహణ జరుగుతుందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి గాజోజు సంతోష్, కోశాధికారి మామిడాల రాములు, నగర ప్రఖండ ప్రముఖ శ్రీధర్ , భూమేష్, తౌటు రామచంద్రం ఆర్ యస్ యస్ సభ్యులు భారత్ సురక్ష సమితి సభ్యులు బి యమ్ యస్ సభ్యులు సామాజిక సమరసిత సభ్యులు హిందూ వాహిని సభ్యులు హిందూ బంధువులు పాల్గొన్నారు.



