ఎల్బీనగర్, వాయిస్ టుడే: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగిన సంక్షేమాన్ని చూసి ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు వస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ పరిధిలోని కర్మన్ ఘాట్ అంబేద్కర్ బస్తీవాసులు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బస్తీవాసులు తీర్మానించి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీకి చెందిన సూల బాబు, పప్పి, జంగయ్య, చందర్, మురళి, సుధాకర్, సురేష్, నవీన్ లతో పాటు బస్తీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు స్వాగతం పలికారు. ప్రభుత్వపరంగా వచ్చే అభివృద్ధి, సంక్షేమాలను అందిస్తూ అన్ని రకాలుగా అదుకుంటానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థాన చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, డివిజన్ అధ్యక్షులు ముడుపు రాజ్ కుమార్ రెడ్డి, చేగోని మల్లేష్ గౌడ్, మధ్యల నరేష్, గౌరీదేవి రాజు, జగదీష్ గౌడ్, టవర్ శ్రీను, శివగౌడ్, నిఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.