జగిత్యాల: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అకడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్లో జగిత్యాల షీ టీం, ఏహెచ్టీయూ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మహిళలు హక్కులు , రక్షణకు షీ టీం ప్రత్యేకంగా పని చేస్తుందన్నారు. అదే విధంగా షీ టీం పని విధానం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్, నేచర్ అఫ్ హరాస్మెంట్, హౌ టూ అప్రోచ్ షీ టీం, ఉమెన్ ట్రాకింగ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, చైల్డ్ మ్యారేజ్, డయల్ హండ్రెడ్ ఇన్ ఎమర్జెన్సీ, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు, యువతులు, విద్యార్థినిలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీం నెంబర్ కి 8712670783 సంప్రదించాలని అన్నారు. సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని , ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ వెంకటేశ్వర్లు,మహిళా కానిస్టేబుల్స్ మంజుల, సౌజన్య,పూజిత, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.