Saturday, December 21, 2024

తెలంగాణకు కాంగ్రెస్ నేతల క్యూ…

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 27, (వాయిస్ టుడే): అభ్యర్ధుల ఎంపికలో ఆలస్యం జరుగుతున్నా… ఎన్నికల ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది… కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.. ఆ క్రమంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు మరోసారి తెలంగాణ పర్యటనకు విచ్చేయనున్నారు … రాష్ట్రంలో ఇప్పటికే ఒక విడత బస్సు యాత్ర పూర్తి చేసిన రాహుల్.. రెండో విడత బస్సు యాత్రకు రెడీ అయ్యారు.. మరోవైపు పాలమూరు ప్రజాభేరి సభకు ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు.. సంబంధిత ఏర్పాట్లలో టీపీసీసీ నేతలు బీజీ అయిపోయారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు … రెండో విడత బస్సు యాత్రను ఆయన వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభిస్తారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి … అయితే రాహుల్‌గాంధీ ఎక్కడ పాల్గొంటారనేది ఖరారు కావాల్సి ఉందంటున్నారు … మొదటి విడత బస్సు యాత్రలో భాగంగా మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణలోని 8 నియోజకవర్గాల్లో పర్యటించిన రాహుల్‌ ఈసారి దక్షిణ తెలంగాణలో పర్యటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Queue of Congress leaders for Telangana...
Queue of Congress leaders for Telangana…

ఇక, ప్రియాంకాగాంధీ ఈనెల 31న కొల్లాపూర్‌లో జరిగే పాలమూరు ప్రజాభేరి సభకు హాజరు కానున్నారు … ఆ రోజు సాయంత్రం శంషాబాద్‌ విమానాశ్రయానికి రానున్న ఆమె అక్కడి నుంచి నేరుగా వెళ్లి కొల్లాపూర్‌ సభలో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు … మాజీ మంత్రి జూపల్లి పార్టీలో చేరిక సందర్భంలోనే ప్రియాంకా గాందీతో కొల్లాపూర్‌లో సభ ఏర్పాటు చేయించాలని భావించినా …అ ప్పుడు సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ఆమెతో సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది … మరోవైపు రాష్ట్ర నేతలు మొదటి విడత బస్సు యాత్ర షురూ చేయనున్నారు

రెండు రోజుల పాటు మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్‌తోపాటు మొత్తం 10 మంది నాయకులు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున 40 నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్‌ తయారు చేస్తున్నారు … ఈ రెండు రోజులపాటు ఆయా నియోజకవర్గాల్లో గడప గడపకూ వెళ్లి ఆరు గ్యారంటీ పథకాల కార్డులను పంపిణీ చేయడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసే సభల్లో కూడా నేతలు పాల్గొననున్నారు.

పార్టీ అభ్యర్థుల ఖరారు కోసం ఢిల్లీలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమవుతోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు … అభ్యర్థుల ఎంపికలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని, సీఈసీ నిర్ణయమే ఫైనల్‌ అని ఆయన వెల్లడించారు.. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానాలను మైనార్టీ నేతలు అడుగుతున్నారని, పార్టీ కూడా మైనార్టీలకు న్యాయం చేస్తుందంటున్నారు…. వాస్తవానికి మహేశ్‌కుమార్‌గౌడ్‌ నిజామాబాద్‌ అర్బన్‌ స్థానాన్ని ఆశిస్తున్నారు .. రాష్ట్ర నాయకత్వం ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకు సానుకూలంగానే ఉన్నా ఆయనకు మైనార్టీ సెగ తప్పదంటున్నారు … మరోవైపు ఇదే స్థానం తనకు కేటాయించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తనయుడు ధర్మపురి సంజయ్‌ కూడా గట్టిగా పట్టుపడుతున్నాడు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్