డోర్నకల్: డోర్నకల్ నియోజక వర్గంలో భూపాల్ నాయక్ కు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి . మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో 35 ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ నుండి భూపాల్ నాయక్ కు టికెట్ ఇవ్వాలని మద్దతు ప్రకటించారు. యువనాయకుడైన భూపాల్ నాయక్ వల్లనే డోర్నకల్ నియోజక వర్గ ప్రజలకు మేలు జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ లతో పాటు భూపాల్ స్వంత ఎజెండాతో ఐదు గ్యారంటీ లతో ప్రజల ముందుకు పోయి ఎమ్మెల్యేగా గెలిపించుకుoటామని ప్రజా సంఘాలు కాంగ్రెస్ అది నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి…..ఈ కార్యక్రమంలో ఎమ్మార్సీఎకస్, లంబాడి హక్కుల పోరాట సమితి, సామాజిక తెలంగాణ ప్రెంట్, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, బహుజన స్టూడెంట్ యూనియన్, రజక సంఘం, వికలాంగుల సంఘం, యాదవ సంఘం, నిరుద్యోగ JAC సంఘాలు తమ మద్దతు ను ప్రకటించాయి.



