రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ

- Advertisement -

ఏఐఎంఐఎం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్, బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.పి. వివేకానంద్.

కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 27) : ఏఐఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు రాబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కె.పి. వివేకానంద్ కి పూర్తి మద్దతు తెలిపిన ఏఐఎంఐఎం పార్టీ, మైనారిటీల సంక్షేమం కోసం ఆలోచించి వారి సమస్యలను తీర్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ అన్నారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కె.పి. వివేకానంద్ కి తమ పూర్తి మద్దతును తెలుపుతూ కొంపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏఐఎంఐఎం నాయకులు ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ మీర్జా రహమత్ బేగ్ హాజరై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మైనారిటీ సోదరుల అభివృద్ధి కోసం అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు తీర్చామన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ మునీరుద్దీన్, నాయకులు ఫక్రు, మతిన్, అక్బర్, యాకూబ్, అజార్, జిలాని, కబీర్ ఖాన్, అమీర్ ఖాన్, సలీం, అఫ్జల్, ఆదిల్, నబీ, అబూ బాకర్ తదితరులు పాల్గొన్నారు.

the-brs-party-is-the-only-party-in-the-state-that-supports-the-welfare-of-the-muslim-minorities
the-brs-party-is-the-only-party-in-the-state-that-supports-the-welfare-of-the-muslim-minorities
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular