గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
సికింద్రాబాద్,అక్టోబర్ 27 (వాయిస్ టుడే ప్రతినిధి): సికింద్రాబాద్ నియోజకవర్గం, తార్నాక డివిజన్లోని మాణిక్యేశ్వర్ నగర్ లో బి ఆర్ ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్, బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి లతో కలిసి పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి నిర్వహించారు, తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను వివరిస్తూ పాదయాత్ర చేస్తూ ఇంటింటికి ప్రచారాన్ని కొనసాగించారు, ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబర్ 1 గా నిలిచిందని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించామని, ప్రజల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అద్భుతమైన స్పందన వస్తుందని రాబోయే ఎన్నికల్లో పార్టీని అధిక మెజారిటీలో గెలిపించుకొని కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు, అలాగే పద్మారావు ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజల మద్దతు కోరుతూ గడపగడపకు ప్రచారాన్ని సాగించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



