కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం

- Advertisement -

కంటోన్మెంట్, అక్టోబర్ 28 (వాయిస్ టుడే ప్రతినిధి): కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించిన సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు వెన్నెల నివాసముకు చేరుకొని ఆమెకు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వెన్నెల మీడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ టికెట్ కేటాయించిన కేంద్ర నాయకులకు రాష్ట్ర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నియోజకవర్గంలోనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కార్యకర్తలను కలిసి త్వరలోనే ప్రచారం చేపడతానని తెలిపారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular