తెలంగాణలో సంక్షేమ పథకాల పండుగ
రైతుబంధు వద్దన్నా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి .
కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరికలు
వాయిస్ టుడే న్యూస్ పటాన్ చెరు: స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు భరోసాను అందిస్తూ.. ప్రతి పేదవాడి ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ఇంట్లో సంక్షేమం ఇంటి ముంగిట అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మన విజయాన్ని అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీట్లను అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. మతతత్వ నినాదంతో ముందుకు వెళుతున్న బిజెపి పార్టీని తెలంగాణ ప్రజలు తరిమికొట్టడం ఖాయమని తెలిపారు. దశాబ్ది కాలంలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రతి హామీని నెరవేర్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీకి దక్కిందని తెలిపారు. కులం మతం ప్రాంతం పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు వారి జీవితాల్లో నవ శకాన్ని ఆరంభించామని తెలిపారు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజల సంక్షేమం కోసం దళిత బందు, బి సి బందు, మైనార్టీ బందు, రైతు బంధు, రైతు బీమా, గృహలక్ష్మి, చేనేత బంధు లాంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టి మనసున్న మహారాజుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు.
ప్రతిపక్షాలు ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లను అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమ కోసం ఏ కార్యక్రమం చేపట్టిన వివిధ కారణాలతో అడ్డు తలుగుతు ప్రగతిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు స్పష్టమైన తీర్పును ఇవ్వబోతున్నారని, ప్రతిపక్షాల చెంప చెల్లుమనేలా మెజార్టీని అందించాలని కోరారు.
పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రశాంత్, గౌతమ్, తదితరులు తమ మిత్రబృందంతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాండు, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



