శేరిలింగంపల్లి, వాయిస్ టుడే: శేరిలింగంపల్లి మండల పరిధిలో గల ఇజ్జత్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర మాల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో తెలంగాణ రాష్ట్ర మాల పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య మాట్లాడుతూ మాలలను అణిచి వేసే ధోరణితో ఎస్సీ వర్గీకరణ చేస్తామని అంటున్నా, రాజకీయ పార్టీల వైఖరిని తెలంగాణ రాష్ట్ర మాల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుదoదని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధిక జనాభా కలిగిన మాలలకు ప్రభుత్వ పథకాల అమలులోను, రాజకీయంగాను తీరని అన్యాయం జరుగుతుందని, ఈ అన్యాయాలపై మాల సామాజిక వర్గాన్ని చైతన్యపరిచేందుకు మొదటగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేడు ఆదివారం నుంచి బస్తి బాట చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మాల పోరాట సమితి నిర్ణయించిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ క్రింది డిమాండ్లను తీర్మానించింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మాల జనాభా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాలలకు 10 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని, ఎస్సీలలో అత్యధికంగా వెనుకబడిన కులాలను గుర్తించి వారికి ప్రత్యేకమైన అభివృద్ధి పథకాలతో ప్రత్యేక ప్రణాళికలను తయారు చేసి తగిన నిధులు కేటాయించాలన్నారు. ఎస్సీల సంవత్సర ఆదాయం రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని, ఈ డబ్ల్యూ ఎస్ విధించిన అర్హతలను వర్తింపజేయాలని. ఎస్సీ రిజర్వేషన్ కోటాను 20 శాతానికి పెంచాలన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, కేజీ టు పీజీ ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని,. ప్రతి మండల కేంద్రంలో గురుకుల పాఠశాల జూనియర్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన దళితున్ని ముఖ్యమంత్రి చేయాలని, అదే విధంగా నవంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర మాల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే మాలల అలైబలై కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని మాలలు, మాల మేధావులు మాల విద్యార్థులు అడ్వకేట్లు, కళాకారులు మహిళలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల పోరాడ సమితి వైస్ చైర్మన్లు మన్నే శ్రీధర్ రావు, మద్దెల వెంకటయ్య, తలారి అంజి,సంఘం కురుమూర్తి సంగమల వాసు, జట్టి కురుమయ్య, అవుట ఆంజనేయులు,జెట్టి కేశవులు కుడుముల శివ,ఎద్దుల సంగమయ్య,లు పాల్గొన్నారు.
మాల పోరాట సమితి ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ
- Advertisement -
- Advertisement -



