చేరుకున్న ఈవీఎం బాక్సులు…

- Advertisement -

రంగారెడ్డి అక్టోబర్ 28 వాయిస్ టుడే ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి బుధవారం ఈవీఎం బాక్సాలు పోచారం సమీపంలోని సీవీఆర్‌ కళాశాలకు చేరుకున్నాయి.
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 319 పోలింగ్‌ కేంద్రాలకు గాను 396 ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, 446 వీవీపీఏటీలు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీఓ అనంతరెడ్డి తెలిపారు. సీవీఆర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలో ఈ యంత్రాలను భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల కంటే అదనంగా మెషీన్లు, వీవీపీఏటీలు వచ్చినట్లు వెల్లడించారు. నవంబర్‌ 30న జరిగే పోలింగ్‌కు సీవీఆర్‌ కళాశాల నుంచి ఈవీఎంలను, సిబ్బందిని పంపుతామని.. తిరిగి పోలింగ్‌ అనంతరం ఇక్కడే ఈవీఎంలను భద్రపరుస్తామన్నారు. ఎన్నికల కౌటింగ్‌ కూడా ఈ కళాశాలలోనే జరుగుతుందని ఆయన వెల్లడిఇంచారు.

కటింగ్‌ చేస్తా.. ఓటు పట్టేస్తా

మొయినాబాద్‌: చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య బుధవారం మొయినాబాద్‌లో వినూత్న ప్రచారం చేపట్టారు. వీరన్నపేటలోని ఓ హెయిర్‌ సెలూన్‌లో కత్తెర పట్టి కటింగ్‌ చేశారు. అన్నా నీ ఓటు నాకే వేయాలి అని అభ్యర్థించారు. అనంతరం ఓ హోటల్లో పూరీలు దేవారు. వృద్ధులతో ఫించన్‌ అందుతుందా అని ఆప్యాయంగా మాట్లాడారు. పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి: ఏసీపీ

చేవెళ్ల: అసెంబ్లీ ఎన్నికలను ప్రజలు ప్రశాంతవాతవారణంలో జరుపుకోవాలని చేవెళ్ల ఏసీపీ పి.ప్రశాంత్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల మండలం ఆలూరులో బధవారం రాత్రి సీఐఎస్‌ఎఫ్‌ బృందంతో కలిసి ఆయన కవాతు నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ.. ప్రశాంత ఎన్నికలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. కవాతుతో సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపునకు అవకాశం ఉంటుందన్నారు. పార్టీలన్నీ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐలు లక్ష్మారెడ్డి, యాదయ్య, రంగా, ఎస్‌ఐలు వీరబ్రహ్మం, పోలీసు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular