పగలు వేడి రాత్రి చలి..  

- Advertisement -

విభిన్న వాతావరణం

హైదరాబాద్‌, :  కొద్దిరోజులుగా పగలు సాధారణం కన్నా ఎక్కువకు, రాత్రుళ్లు సాధారణం కన్నా దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.  దీంతో రైతులు, ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. పగటిపూట గాలిలో తేమ శాతం సగానికి పడిపోతుండటం, రాత్రి వరకు ఒక్కసారిగా పెరుగుతుండటమే ఈ పరిస్థితికి కారణమని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఖమ్మంలో సాధారణం కన్నా 3.8 డిగ్రీలు అధికంగా 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 2.1 డిగ్రీలు అధికంగా 32.7, నిజామాబాద్‌లో 1.2 డిగ్రీలు అధికంగా 33, భద్రాచలంలో 1.8 డిగ్రీలు అధికంగా 33.4, ఆదిలాబాద్‌లో ఒక డిగ్రీ అధికంగా 32.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ మినహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular