ఎమ్మెల్యే కే. పీ. వివేకానంద
కుత్బుల్లాపూర్ లో వాడిపోతున్న కమలం ప్రతిపక్షాల నాయకుల చేరికలతో దూసుకుపోతున్న కారు : ఎమ్మెల్యే కే. పీ. వివేకానంద
కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 30) : ఈ రోజు ప్రగతి భవన్లోని మంత్రి కేటీఆర్ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎం. ఎస్. వాసు, కాంగ్రెస్ పార్టీ 130- డివిజన్ మాజీ అధ్యక్షులు, బిజెపి సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మి నారాయణ, బిజెపి మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి రెడ్డి, ఆదర్శనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్ వి ఎన్ చారి, కుత్బుల్లాపూర్ సోషల్ మీడియా అసెంబ్లీ కో- కన్వీనర్ ఎస్.కె. అనోక్ గారు, బీజేపీ 130 – డివిజన్ ఉపాధ్యక్షులు ఆడబళ్ళ వెంకట రత్నం, ఎమ్.ఎస్. వాసు యువసేన అధ్యక్షులు పిప్పాల మారుతి నాయుడు, యూత్ కాంగ్రెస్ నాయకులు రాఘవేంద్ర చారి మొదలైన వారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంభిపుర్ రాజు, ఎమ్మెల్యే కే. పీ. వివేకానంద అధ్వర్యంలో ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద మాట్లాడుతూ
బిజెపి వంటి మతతత్వ పార్టీలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భవిష్యత్తు లేదు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, అభివృద్ధిలో పాలుపంచుకునే ప్రతి ఒక్కరికి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.