సికింద్రాబాద్, అక్టోబర్ 31 (వాయిస్ టుడే ప్రతినిధి): నారా చంద్రబాబు నాయుడు విడుదలైతే 1116 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్న చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, ఓయూ పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణ లో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఎదుట 1116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అంతకుముందు బాణసంచా కాల్చి మిఠాయి లు పంచుకొని చంద్రబాబు చిత్రపటానికి బూడిద గుమ్మడికాయ తో దిష్టి తీశారు. ఈరోజు చంద్రబాబు అభిమానులకు పండుగ రోజు అని, భువనేశ్వరి అమ్మ చేపట్టిన యాత్రతో నిజం గెలిచిందని అధికారం అడ్డం పెట్టుకొని వ్యవస్థలను ఎన్నో రోజులు నియంత్రణ చేయలేరన్నారు. చంద్రబాబు కోసం అభిమానులు,కార్యకర్తలు చేసిన ఉద్యమాలు, పూజలు ఫలించాయి అన్నారు.కొందరు అభిమానులు సంతోషం పట్టలేక రోధించారు, కొందరు నృత్యాలు చేసి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సతీష్ గౌడ్,వినోద్, గోపీ, మల్లేష్,మురళీ, మధు, సతీష్,మహేష్, ప్రవీణ్,సుదర్శన్, నరేష్, ప్రసాద్, సురేష్, వెంకటేష్, నాగరాజు, ప్రేమ్,శంకర్, విక్కీ, పరశురాం, జానకి, పండు ,కొండల్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఓయూలో 1116 కొబ్బరికాయ కొట్టిన తలారి శ్రీనివాసరావు
Published By Voice Today Team
168
- Advertisement -
- Advertisement -
- Tags
- actor chandrababu
- ap cm chandrababu
- ap cm chandrababu naidu
- chandrababu
- chandrababu arrest
- chandrababu bail news
- chandrababu comments
- chandrababu naidu #
- chandrababu naidu case
- chandrababu naidu jail
- chandrababu naidu news
- chandrababu political career
- chandrababu political history
- chandrababu speech
- cm chandrababu
- cm chandrababu naidu
- jagan fire on chandrababu
- n. chandrababu naidu
- rgv vs chandrababu
- unstoppable 2 chandrababu naidu episode



