Sunday, March 22, 2026

బిఆర్ఎస్ ఇక ఇంటికే రానున్నది కాంగ్రెస్సే బండి రమేష్

- Advertisement -

కంటోన్మెంట్, అక్టోబర్ 31 (వాయిస్ టుడే ప్రతినిధి): కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దుండగల యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్, రాష్ట్ర నాయకుడు కూకట్పల్లి ఇంచార్జ్ సత్యం శ్రీరంగం లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలోబండి రమేష్ మాట్లాడుతూ..రెండు పర్యాయలు ఎమ్మెల్యే గా గెలిచి మాధవరం కృష్ణారావు స్థానిక ప్రజల కోసం గొప్ప ప్రాజెక్టు ఎంతీసుకు వచ్చారని ప్రశ్నించారు.
రోడ్లు డ్రైనేజీ వేయడంతోనే అభివృద్ధి అని సీఎం కెసిఆర్ చెప్పాడాన్ని బండి రమేష్ వ్యతిరేకించారు.హైదరాబాద్ ను డల్లాస్ గా చేస్తానని మాటలుచెప్పారు.చేశారాని ప్రశ్నించారు ? హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్లుగా చేస్తాని చెప్పారు. కొబ్బరి నీళ్లు ఇచ్చారా అభివృద్ధి అంటే నిరంతర ప్రక్రియని బండి వివరించారు.
కూకట్పల్లి కి ఐకాన్ ప్రాజెక్ట్ వచ్చిందా మినీ ఇండియాగా కూకట్పల్లి కి పేరుంది, వచ్చిందా అని అడిగారు
100 పడకల హాస్పిటల్ ఏమైనా తీసుకు వచ్చారా? అభివృద్ధి పై చర్చకు సిద్ధం రావాలని సవాలు విసిరారు. ప్రభుత్వం అందిస్తున్న దళిత బందు లో అవినీతి జరిగిందని, కేవలం హంగులు, ఆర్భాటాలే తప్పా మరేమి లేదని ఏద్దేవా చేశారు.ముస్లిం మైనారిటీ లకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అమలు చేశారా.కూకట్ పల్లి నియోజకవర్గం లో శ్రీకాకుళం కు చెందిన జనం నివాసం ఉన్నారు,మంత్రి కేటీఆర్ వారికీ ఇచ్చిన హామీ నేరవేర్చారా? ప్రజలకు న్యాయం చేశారా,ఆ జనాన్ని బీసీ ల్లో చేర్చారా,చెరువు కబ్జా చేశారని ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుందని రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెల బోతున్నామని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్