- Advertisement -
10వ తేదీ వరకు నాలుగు అంచెల్లో ఫార్ములా-4 రేసింగ్ పోటీలు
హైదరాబాద్, నవంబర్ 1: ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్‌ఎల్) పోటీలకు ఎన్నికల కోడ్‌తో అవాంతరం ఏర్పడింది. షెడ్యూ ల్ ప్రకారం ఈ నెల 4, 5 తేదీల్లో ఐఆర్‌ఎల్ తొలి అంచె పోటీలు హైదరాబాద్ హుసేన్‌సాగర్ తీరప్రాంతంలో జరుగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దృష్ట్యా రేసింగ్ లీగ్‌కు పోలీస్ భద్రత ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తే అవకాశం నెలకొంది. నేపథ్యంలో రేసింగ్ లీగ్‌ను హైదరాబాద్ నుంచి చెన్నైకి మారుస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే రేసింగ్ లీగ్ కోసం టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు త్వరలోనే డబ్బులు రీఫండ్ చేస్తామని వారు స్పష్టం చేశారు. వచ్చే నెల 10వ తేదీ వరకు నాలుగు అంచెల్లో ఫార్ములా-4 రేసింగ్ పోటీలు జరుగనున్నాయి.
- Advertisement -



