నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు
జగిత్యాల: జగిత్యాల పట్టణాభివృద్ధికి బాటలు వేసింది తానేనని ,నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉండి సేవలు అందిస్తున్నానని జగిత్యాల కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.బుధవారం
పట్టణం లోని మిని స్టేడియం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి వాకింగ్ చేస్తూ, విశ్రాంత ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు, మహిళలను ఓటు అభ్యర్థించారు.
కాంగ్రెస్ పాలనలో చేపట్టిన సంస్కరణలు, నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ , ఆరోగ్యశ్రీ తో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించామని, ఉద్యోగులకు కాంగ్రెస్ పాలనలో అత్యధికంగా మధ్యంతర బృతి అందజేశామని గుర్తు చేశారు.
జగిత్యాల పట్టణ అభివృద్ధికి బాటలు వేశామని చెబుతూ టౌన్ లో ఇంటింటికి రు.200 లకే నల్లా కనెక్షన్లు అందించి, ఉమ్మడి రాష్ట్రంలో ఏ జగిత్యాల మున్సిపాలిటీలో లేనివిధంగా నిత్యం తాగు నీరు సరఫరా చేశామని గుర్తు చేశారు.
ఎన్నికల్లో ఓడినా..గెలిచినా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నామని అన్నారు.
కాంగ్రెసు పార్టీని ఆదరించి చేతి గుర్తుకు ఓటువేసి నన్ను గెలిపించాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.