భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటాం
-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్
కరీంనగర్ నవంబర్ 01(వాయిస్ టుడే)పార్లమెంట్ పరిధిలోని 7 నియోజక వర్గాల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ కి అత్యంత ఇష్టమైన జిల్లా కరీంనగర్ జిల్లా అని, ఇక్కడ నుంచి మొదటి నుంచి బీఆర్ఎస్వీలో విద్యార్థి నాయకులు చురుకైన పాత్ర పోషించారని, అందుకే ఇక్కడ విద్యార్థి నాయకులకు పదవులను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కేసీఆర్ ఇస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే సిద్ధం వేణును సిర్సిల్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ గా, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గా పొన్నం అనిల్ కుమార్ గౌడ్లకు పార్టీ అవకాశం ఇచ్చిందని, రాబోవు రోజుల్లో బీఆర్ఎస్వీ నాయకులకు మరి కొంతమందికి ప్రభుత్వంలో భాగస్వాములయ్యేలా పదవులను ఇస్తామని అన్నారు. కరీంనగర్ గంగుల కమలాకర్ తో పాటు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో భారీ మెజార్టీతో మన అభ్యర్థులు గెలిచేలా విద్యార్థి నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ పరిధిలో విద్యార్థి యువ సమ్మేళనం ఏర్పాటు చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గందె మాధవి మహేష్, రాజన్న సిరిసిల్ల జెడ్పీ వైస్ చైర్మెన్ సిద్ధం వేణు, ఆరె రవి గౌడ్, పటేల్ శ్రావణ్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి చుక్క శ్రీనివాస్, దూలం సంపత్ గౌడ్, బీఆర్ఎస్వీ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, యూత్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, సోమిరెడ్డి రాజ నరేష్ రెడ్డి, వోడ్నాల రాజు, మల్లెంకి శ్రీనివాస్, మాడిషెట్టి అజయ్, రజ్జు, నారదాసు వసంత్, జక్కుల అఖిల్ గౌడ్, వినోద్, సతీష్, ఆఫ్రోజ్, శ్రీధర్, రాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.



