అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేసిన బీజేవైయం నాయకుడు…
కామారెడ్డి బ్యూరో నవంబర్2 (వాయిస్ టుడే);
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఓక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విట్టల్ కు చికిత్స నిమిత్తం అతి కొద్ది మందిలో ఉండే ఏ నెగిటివ్ రక్తం అత్య అవసరం కావడంతో కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించడంతో తాడ్వాయి మండలం దేమేకలన్ గ్రామానికి చెందిన బీజేవైయం జిల్లా నాయకులు అచ్యుత్ రెడ్డి సహకారంతో వారికి కావలసి ఏ నెగిటివ్ రక్తం సకాలంలో అందచేసి ప్రాణాలను కాపాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేవైయం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు రక్తదానానికి ముందుకు రావాలని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని కోరారు.ఒక్క ఫోన్ చేయగానే స్పందించి రక్తదానానికి ముందుకు వచ్చినందుకు అచ్యుత్ రెడ్డిని జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ అభినందించారు . ఈ కార్యక్రమంలో కొత్త నరేష్ పటేల్ ,స్వామి బ్లడ్ సెంటర్ టెక్నీషియాన్లు తదితరు పాల్గొన్నారు.
అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేసిన బీజేవైయం నాయకుడు…
- Advertisement -
- Advertisement -



