మధుయాష్కీతో భేటీ అయిన ప్రొఫెసర్ కోదండరాం
వనస్థలిపురం, వాయిస్ టుడే:
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కిగౌడ్ తో తెలంగాణ జన సమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం గురువారం భేటి అయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీజేఎస్ పార్టీ మధుయాష్కి గౌడ్ కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని టీజేఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మధుయాష్కి గెలుపు కోసం స్వచ్ఛందంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు పల్లె వినయ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.



