బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రు పట్ల సునీల్ రెడ్డి
మంథని: మంథని నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలుపు పేద ప్రజల బ్రతుకులకుమలుపు అని
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రు పట్ల సునీల్ రెడ్డి అన్నారు.
గురువారం మంథని పట్టణంలోని బిజెపి పార్టీ ఆఫీసులో ముత్తారం మండలం శాత్రజ్ పల్లి, మంథని మండలం ఆరెంద గ్రామాలకు చెందిన సుమారు 100 మంది మహిళలు, యువకులు, భారీగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి సునీల్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు, అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ మంథని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేద ప్రజల బ్రతుకుల్లో మార్పులు రావాలంటే కాంగ్రెస్ బి ఆర్ స్ కు చరమగీతం పాడి ఒక కొత్త రాజకీయ వ్యవస్థకు ఈసారి ప్రజలు పట్టం కట్టాలన్నారు. అవినీతి, అసమర్థ పాలనను ఈరోజు ప్రజలు చీదరించుకుంటున్నారని, 40 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్, 10 సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ మంథని కి చేసిన అభివృద్ధి ఏమిటో ఓట్ల అడిగే ముందు నాయకులు ప్రజలకు చెప్పాలన్నారు.ఈ ప్రాంతంలో ఒక మంత్రి ఒక స్పీకర్ ఒక ఒక ప్రధాని గా ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఎందుకు మంథని ప్రాంతం ఇంకా డెవలప్ కాలేదని పక్క నియోజకవర్గం రామగుండంలో మెడికల్ కాలేజీలు ఆర్ ఎఫ్ సి ఎల్, ఎఫ్సీఐ వంటి పరిశ్రమలు వస్తుంటే మంథని ప్రాంతానికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.చేతకాని నాయకుల అసమర్ధ పాలన, ఇక మంథనిలో సాగవని ఒకసారి బిజెపి పార్టీకి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్కామోహన్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండపాక సత్య ప్రకాష్, కో కన్వినర్ నాంపల్లి రమేష్,మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్,ఇంచార్జ్ తోట మధుకర్,మండల ప్రధాన కార్యదర్శి అరె ఓదెలు, మహిళ మోర్చా అధ్యక్షులు బోసెల్లి మౌనిక, ఎస్ సి మోర్చా అధ్యక్షులు బూడిద రాజు, మైనారిటీ మోర్చా అధ్యక్షులు చంద్ పాషా,సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, గాడేపు కృష్ణ, కోరబోయిన మల్లికార్జున్, కొట్టె సాంబయ్య,చీదురాల మధుకర్ రెడ్డి, బీజేవైఎం మండల, పట్టణ అధ్యక్షులు చిట్టావేన హరీష్, బుర్ర రాజు, సీనియర్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్, అడిషనపల్లి శ్రీనివాస్, బోసెల్లి శంకర్,అంకాల కుమారస్వామి, కుర్మ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



