- Advertisement -
హైదరాబాద్, నవంబర్ 2,(వాయిస్ టుడే ): మహబూబ్ నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికార్ అహ్మద్ పై బుధవారం అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. స్థానికంగా ఓ పీఎస్ లో విధులు నిర్వహిస్తోన్న ఓ కానిస్టేబుల్ ఆయనపై హత్యా యత్నానికి పాల్పడ్డాడు. సీఐ ప్రైవేట్ పార్టు కోసేయడం సహా ఆయన తలపై పదునైన ఆయుధాలతో నిందితుడు దాడి చేశాడు. అనంతరం సీఐ వచ్చిన కారులోనే పట్టణ సమీపంలోని రోడ్లపై వదిలి వెళ్లాడు. ఉదయాన్నే సీఐను గుర్తించిన స్థానికులు, స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే దీనికి కారణమని భావిస్తున్నారు.
- Advertisement -