హైదరాబాద్, నవంబర్ 2, (వాయిస్ టుడే ): కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా అంటూ మైనంపల్లి పై మంత్రి హరీష్ రావ్ మండిపడ్డారు. మల్కాజ్ గిరి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇక్కడ ఎన్నికలు మంచి మనసున్న మనిషి మాటలు, ముఠాల మనిషి మధ్య పోటీ అన్నారు. మైనంపల్లి స్వార్థం కోసం పార్టీ మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్, మల్కాజగిరి రెండు చోట్ల ఓడటం ఖాయమన్నారు. కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా? అని ప్రశ్నించారు. 28 రోజులు కష్టపడి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. దత్తత తీసుకొని అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా అని మంత్రి అన్నారు. ఏ సర్వే చూసినా 75 నుండి 80 సీట్లతో బిఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. కర్ణాటకలో కుర్చీల కొట్లాట జరుగుతున్నది. ఒకర్ని దించాలే, మరొకరిని ఎక్కించాలన్నారు. కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుందని తెలిపారు.భూమికి బరువైన పంట పండుతున్నది. రైతు బంధు, రైతు బీమా తో వ్యవసాయం పండగ అయ్యిందని తెలిపారు పల్లె పల్లేన పల్లర్లు మొలిచే తెలంగాణలో అని నాడు పాటలు ఉండేవన్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అని ఉండే అన్నారు. నేడు ఆ పాటలు తిరగ రాయాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇవన్నీ ఎలా సాధ్యం అయ్యింది. మంత్రం వేస్తే అయ్యిందా, మాయ చేస్తే అయ్యిందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు రైతుల వద్ద డబ్బులు తీసుకున్నవి. మా ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ రిజెక్టేడ్ నాయకులు. పోటీ చేసేందుకు నాయకులు లేరన్నారు. పోటీ చేసేందుకు నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరని తెలిపారు.
కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా..
Published By Voice Today Team
212
- Advertisement -
- Advertisement -
- Tags
- harish rao
- harish rao entry
- harish rao exclusive interview
- harish rao interview
- harish rao latest news
- harish rao live
- harish rao live t news
- harish rao live today
- harish rao public meeting live
- harish rao speech
- harish rao speech live
- harish rao speech today
- harish rao t news live
- minister harish rao
- minister harish rao exclusive interview
- minister harish rao interview
- minister harish rao live
- minister harish rao speech
- mynampally vs harish rao



