సూర్యాపేట : బిఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారని కాంగ్రెస్ పార్టీ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 19, 26,27 వ వార్డులో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్లు కోల్లా. లక్ష్మీ ప్రసన్న కోటిరెడ్డి, షాబుద్దీన్ భారీగా జన సమీకరణ చేసి పద్మావతి రెడ్డికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వార్డులో ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీ పథకాలను కరపత్రాలు పంచుతూ ప్రజలందరికీ వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా హామీలను అమలు చేస్తామన్నారు. బిఆర్ఎస్ పార్టీ అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను గత తొమ్మిదేళ్లుగా మోసం చేసిందన్నారు. కోదాడలోగంజాయితో యువత భవిష్యత్తు నాశనం కావడంతో పాటు గల్లీ, గల్లీకి బెల్ట్ షాపులు ఏర్పాటుచేసి ప్రజలను మత్తులో ముంచి తెలుస్తుంది అన్నారు.కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచులు ఎర్నేని. వెంకటరత్నం బాబు, చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి,పారా సీతయ్య,వంగవీటి రామారావు, జబ్బార్, కందుల. కోటేశ్వరరావు,గంధం. యాదగిరి,షమ్మీ, బషీర్,డేగ శ్రీధర్,బాగ్ధద్, బజాన్,అంబడికర్ర. శ్రీను,కర్రీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.