కామారెడ్డి నుంచి రేవంత్, నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ
6నా రేవంత్, 9న షబ్బీర్ నామినేషన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 4 (వాయిస్ టుడే) గత కొద్ది రోజులుగా కామారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారని ఉత్కంఠకు శనివారం కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం తెరదించిందనీ సమాచారం. కామారెడ్డి నుండి కెసిఆర్ పోటీ చేస్తున్నందున ఆయనకు దీటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బరిలో దించుతున్నట్లు అధిష్టానం బీఫామ్ విడుదల చేసింది, గత కొద్ది రోజుల నుండి ఇక్కడే షబ్బీర్ అలీ కామారెడ్డిలో గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. నిజామాబాద్ అర్బన్ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నందున నిజాంబాద్ అర్బన్ నుండి బరిలో దించుతున్నట్లు అధిష్టానం పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఇద్దరి లకు అధిష్టానం బీఫామ్ అందజేశారు.
కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. 6న కామారెడ్డిలో రేవంత్ తన నామినేషన్ వేస్తున్నారని, 9వ తేదీన షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుండి నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు కామారెడ్డి నుండి పోటీ చేయడంతో ఇక్కడ కార్యకర్తలకు నూతన ఉత్తేజం నెలకొంది. కామారెడ్డి నియోజకవర్గంలో టిఆర్ఎస్ నుంచి కేసీఆర్ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బిజెపి నుండి రమణారెడ్డి ఒకరికి ఒకరు దీటుగా ప్రచారాలతో నియోజకవర్గాన్ని ఉత్తేజపరచనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రచారాలు నిర్వహించిన పేద ప్రజలకు సౌకర్యాలు అందేనా లేదా చూడాల్సి ఉంది.