- Advertisement -
అంజన్న సన్నిధిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు
జగిత్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ, జగిత్యాల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మంగళ వారం మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామినీ దర్శించుకొన్నారు. నామినేషన్ వేసే ముందు జీవన్ రెడ్డి ఆరాధ్య దైవం ఆంజనేయస్వామి నీ దర్శించుకొని, ముడుపులు కట్టిన అనంతరం నామినేషన్ వేయడం ఆనవాయితీగా వస్తోంది. జీవన్ రెడ్డి జగిత్యాలలో ఈ రోజు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని, స్వామి వారికి ముడుపులు కట్టారు. జీవన్ రెడ్డి దంపతులకు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.
- Advertisement -