మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి మల్లరెడ్డి మేడ్చల్ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి.నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజ కార్యక్రమలు నిర్వహించిన మంత్రి మల్లరెడ్డి.అనంతరం ఆలయ పండితులు ఆశీర్వాదం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కీసర గుట్ట నుండి నేరుగా కీసర ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ ఓ రాజేష్ కుమార్ కి నామినేషన్ పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మల్లరెడ్డి మాట్లాడుతూ కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు నాకు ఉన్నాయి.ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు మూడో సారి అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు.నేను మేడ్చల్ ప్రజలకు ఓ విన్నపం చేస్తున్న నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను అంతే కాని దోసుకోవడానికి ఏమి రాలేదు అని గుర్తు చేశారు.నాకన్నా మంచి లీడర్ వస్తే ప్రజలు వాళ్ళకే ఓటు వేసుకోమని ప్రజలకు సూచించారు.మేడ్చల్ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో నాకే ఎక్కువ మెజారిటీ రావచ్చు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేష్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.